by Suryaa Desk | Mon, Dec 30, 2024, 05:23 PM
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.జుక్కల్ మండల కేంద్రంలోని బసవేశ్వర చౌక్ నుంచి అంబేడ్కర్ చౌరస్తాలో నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. జిల్లా అధ్యక్షుడు భూమయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఎస్సీ (ఏ బీ సీ డీ) వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరంజుక్కల్ మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ బైక్ ర్యాలీ మద్నూర్ మండలం మీదుగా బిచ్కుంద మండలం మీదుగా పిట్లం పెద్ద కొడఫ్గల్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో కూడా బైక్ ర్యాలీ నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో జుక్క నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.