by Suryaa Desk | Sun, Dec 29, 2024, 07:06 PM
జాతీయ ఆహార భద్రత మిషన్ - మొక్కజొన్న పథకంలో రాయితీ పై మండలంలోని రైతులకు బయో సీడ్ 9544 హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ములుగు సహాయ వ్యవసాయ సంచాలకులు అనిల్ కుమార్ మరియు మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు ప్రారంభించారు . ఈ సందర్భంగా ఏ. డి ఏ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ మండలంలో పత్తి సాగు చేసిన రైతులు పత్తిని తీసి వేసి మొక్కజొన్న పంటను విత్తడం జరుగుతుందని, అలాంటి వారికి జాతీయ ఆహార భద్రత మిషన్ - మొక్కజొన్న పథకంలో భాగంగా బయో సీడ్ 9544 హైబ్రిడ్ మొక్కజొన్న 5 కేజీల ప్యాకెట్ పూర్తి ధర రూ.1375 గాను, రూ. 500 సబ్సిడీ పోగా రూ. 875 చెల్లించి విత్తనాలు పొందవచ్చని తెలిపారు.
దీనికి గాను రైతులు తమ పట్టాదారు పాసుబుక్కు జిరాక్స్ మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని హనుమాన్ ట్రేడర్స్ , జగదేవపూర్ నందు నాన్ సబ్సిడీ డబ్బులు రూ. 875 చెల్లించి రాయితీ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు భాను ప్రకాష్, కిరణ్, కృష్ణమూర్తి మరియు రైతులు పాల్గొన్నారు..