by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:22 PM
ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎగువ మానేరు కుడి కాలువలో పిచ్చి మొక్కలు గుర్రపు డెక్కల మొక్కలతో నిండి ఉండడంతో రైతుల పంట పొలాలకు నీరు అందడం లేదని బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి నాయకులు ఆరోపిస్తూ అధికారులు వెంటనే స్పందించి కాలువలోపిచ్చి మొక్కలు చెత్త చెదారం తొలగించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మానేరు కుడికాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు మీరు అందించామని రైతు అప్పుచేసి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేసుకుంటే కాల్వ ద్వారా నీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అధికారులు మాత్రం ఎగువ మానేరులో నీటిమట్టం తక్కువ ఉన్నందున చివరి ఆయకట్టు వరకు నీరు ఇస్తలేమని తెలిపారు బిఆర్ఎస్ హయాంలో కాలేశ్వరం ద్వారా మండుటెండల్లో ఎగువ మానేరు నింపిన ఘనత కెసిఆర్ అని అన్నారు ప్రతి ఏటా కాలువలలో పిచ్చి మొక్కలను తొలగించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు చివరి ఆయకట్టు వరకు నీరు అందించేలా చూడాలని కాలువలో పిచ్చి మొక్కలు తొలగించాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు శీలం స్వామి బైతి నవీన్. తదితరులు పాల్గొన్నారు.