by Suryaa Desk | Mon, Dec 30, 2024, 02:43 PM
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కి చెందిన గుడ్ల కౌసల్య - రాజు దంపతులు సోమవారం సైకిల్ పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు అని స్థానికులు తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణికి దరఖాస్తు చేసుకోవడానికి దంపతులు సైకిల్ పై వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. చికిత్స నిమిత్తం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.