by Suryaa Desk | Mon, Dec 30, 2024, 02:42 PM
పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద అధికంగా పత్తి ఉందని సీసీఐ కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి చౌరస్తా వద్ద పత్తి రైతులు వెంటనే పత్తి కొనుగోలు చేయాలని ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద భారీగా పత్తి ఉందనే నెపంతో పత్తి కొనుగోలు చేయడం లేదన్నారు.