by Suryaa Desk | Sun, Dec 29, 2024, 07:43 PM
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో ఇటీవల కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందన విషయమై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం గొర్రెల కాపరి సంకటి మల్లయ్య ఇంటికి వెళ్లి పరామర్శించి గొర్రెలు మృతి చెందిన తీరును అడిగి తెలుసున్నారు. గొర్రెలు పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ సంఘటన జరగడం బాధాకరమని దీంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వపరంగా మల్లయ్య కుటుంబంను ఆదుకుంటామని విప్ భరోసాకల్పించారు.
వారి వెంట ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేంధర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కుల మహేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పత్తిపాక శ్రీధర్, సీనియర్ నాయకులు బండి సాగర్, ఉపాధ్యక్షులు ఉప్పులేటి మారుతి, నాయకులు మేరుగు శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, ముడికె జలేంధర్, శేరే తిరుపతి, రాజు, సిగిరి అంజయ్య, గొల్ల కృష్ణ, పడిదం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.