by Suryaa Desk | Mon, Dec 30, 2024, 08:00 PM
తలకొండపల్లి మండల కేంద్రంలో యేళ్ళ క్రితం ఇచ్చిన పట్టాలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో లబ్ధిదారులు బిజెపి నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని వాటిని రద్దు చేసి 2023లో పట్టాలి ఇచ్చిన వారికి కొత్త పట్టా సర్టిఫికెట్లు జారీ చేశారన్నారు. తహసీల్దార్ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.