by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:40 PM
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ (టీటీడీ) బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులను కూడా అంగీకరించాలని ఇటీవల తెలంగాణకు చెందిన పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ ఏపీ సీఎంతో సమావేశమయ్యారు.తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. రెండు బ్రేక్ దర్శనం, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలను అనుమతించేందుకు సీఎం అంగీకరించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సిఫార్సు లేఖలను అంగీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.