by Suryaa Desk | Mon, Dec 30, 2024, 05:36 PM
పైలాన్ కాలనీ లో ధర్మ రక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధూప దీప నైవేద్యం కార్యక్రమం లో భాగంగా పురాతన కోదండ రామాలయం పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నార్ల రామ్ దాస్ , శ్రీనివాస్ మర్రిపూడి ధర్మ రక్ష ఫౌండేషన్ ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షులు అనుముల నవీన్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నార్ల రామ్ దాస్ మాట్లాడుతూ, కోదండ రామాలయం అతి పురాతనమైనది అని, 20సంవత్సరాల క్రితం పోలీసు క్వార్టర్స్ ఉన్నప్పుడు నిత్యపూజలు జరిగేవని, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, అటువంటి దేవాలయాన్ని పునరుధ్ధరించాలని ధర్మ రక్షా ఫౌండేషన్ వారు నిర్ణయించడం ఆ భగవంతుని సంకల్పమని అన్నారు.
ఫౌండేషన్ అధ్యక్షులు నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ కోదండ రామాలయాన్ని దర్శించడం మరియు స్థితిగతులను తెలుసుకొని ఆలయ పునరుద్ధరణకు కోల్పోవడం మా యొక్క పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ప్రస్తుతానికి నిత్య పూజలు ప్రారంభించామని త్వరలో ఈ ఆలయం పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించి నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు కొమ్ము రాందాస్, ప్రధాన కార్యదర్శి నేనావత్ శంకర్ నాయక్, కార్యదర్శి బండారు విజయ్, భగవద్గీత ప్రచారకులు మూర్తి గారు, ట్రెజరర్ కడమంచి నగేష్, పట్టణ అధ్యక్షులు తంగరాజు గణేష్, మద్దమ్మ, యర్రబోయిన రాజు, ప్రేమా రెడ్డి, గోపరాజు చిన్ని తదితరులు పాల్గొన్నారు.