by Suryaa Desk | Sun, Dec 29, 2024, 07:10 PM
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ డివిజన్ పల్లవి మోడల్ స్కూల్ నందు నిర్వహించిన "ప్రధం అన్యువల్ స్పోర్ట్స్ మీట్" ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడల ద్వారా శరీర దారుఢ్యంతో పాటు మానసిక ధైర్యం పెంపొందుతుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కె.ఎం.గౌరీష్, జగన్, డైరెక్టర్లు విద్యాధర్, గిరిధర్, ప్రిన్సిపల్ ధనలక్ష్మి, నాయకులు కిషోర్ చారి, శ్రీకాంత్, జల్ధా లక్ష్మీ నాథ్, సంక్షేమ సంఘం నాయకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.