by Suryaa Desk | Mon, Dec 30, 2024, 03:29 PM
శ్రీ సత్య సాయి సేవ సంస్థ యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఏ పీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు ట్రోఫీని బహుకరించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ.
ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని శారీరకంగా దృఢంగా ఉండటానికి ఆటలు ఆడాలని క్రీడాకారులకీ తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ. ఏనుముల. రేవంత్ రెడ్డి గారు మంచి ప్రోత్సహం అందిస్తున్నరని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సీఎం కప్ పేరుతొ ప్రతి జిల్లాలో పోటీలు నిర్వహించడం జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ సత్యసాయి సేవ సమితి కన్వినర్ డా "సత్యనారాయణ గౌడ్, బస్వరాజ్, మహేష్, సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.