by Suryaa Desk | Mon, Dec 30, 2024, 03:18 PM
ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట గ్రామంలో గోవింద్ అఖిల్ గారి నాన్నగారి సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ యూత్ రాష్ట్ర నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఏ కష్టమొచ్చినా ముందు నిలబడి వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూస్తానని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని వారికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడతానని రణధీర్ రెడ్డి అన్నారు గోవింద్ అఖిల్ను పరామర్శించి ధైర్యం చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా నేను ముందుంటానని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎగితే లింగయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు మంగరాజు మండల పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ కొమ్ముల శ్రావణ్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ మిర్యాల కుమార్ మాజీ ఉప సర్పంచ్ గుండెబోయిన అజయ్ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ దురిశెట్టి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.