by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:18 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారులు కవి లీఫ్ ఆర్టిస్ట్ సైకత శిల్పి ఆచార్య గాలిపెల్లి చోళేశ్వర్ చారి మాజీ ప్రధాని ఆర్థిక సంస్కర్త డా.మన్మోహన్ సింగ్ చిత్రాన్ని రూపాయి బిళ్ళ మీద చిత్రీకరించడు.ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ డా.మన్మోహన్ సింగ్ వారి యొక్క ఆర్థిక సంస్కరణకు చిహ్నంగానే రూపాయి బిళ్ళ మీద వారి చిత్రాన్ని వేసినట్లు చారి తెలిపాడు.భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి పథంలో నడిపించడంలో పీ.వీ నరసింహారావు ప్రధానిగా మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉంటూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని భారతదేశం యొక్క బంగారాన్ని తనకానుండి తీపించడంలో కీలక పాత్ర పోషించారు.వీరు ప్రధానమంత్రిగా అయిన తర్వాత పేద బడుగు బలహీనవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు పరచడంలో ముందున్నారని భారత దేశ ఆర్థిక శాస్త్రవేత్తగా అందరిచే మౌనమునిగా పిలుచుకోబడేటువంటి స్వభావం కలిగినటువంటి మంచి మనసున్న వ్యక్తి.చోలేశ్వర్ చారి ప్రస్తుతం వేములవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా పని చేయుచున్నాడు.
సూక్ష్మ కళాకారుడిగా అనేక సందర్భాల్లో చారి ప్రభుత్వంచే ఉత్తమ చిత్రకారుడిగా,ఉత్తమ సైకత శిల్పిగా మరియు ఉత్తమ ఉపాధ్యాయునిగా 2024 లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు పొందారు.2017లో ఉత్తమ శిల్పకరుడుగా జగిత్యాల జిల్లా తరఫున ప్రభుత్వ అవార్డును పొందారు.వెయ్యికి పైగా సుద్ధముక్కలతో పాటు ఆకులు పాలు,నీళ్లు,రావి ఆకులు,బియ్యం గింజలు ఇతర వస్తువుల మీద కూడా శిల్పాలు చెక్కడం లో నేర్పరి.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్,ఇండియా బుక్,వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి పలు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు.