by Suryaa Desk | Mon, Dec 30, 2024, 03:34 PM
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలానికి చెందిన అయ్యప్ప స్వాములు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఆదివారం కలిసి, మండల కేంద్రంలోని పెద్ద వాగు సమీపంలో అయ్యప్ప స్వామి ఆలయానికి స్థలాన్ని చూపించి, ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరగా వెంటనే స్పందించిన విప్ అడ్లూరి ఆలయ నిర్మాణానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
రెండు రోజుల్లో వచ్చి భూమి పూజ చేస్తానని స్వాములకు హామీ ఇచ్చారు, అదేవిధంగా శబరి యాత్రకు ఆర్టీసీ ద్వారా వెళ్లే స్వాములకు తమిళనాడు బోర్డర్ టాక్స్ మాఫీ కోసం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ తో మాట్లాడగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా స్వాములు ప్రభుత్వ విప్ ని శాలువతో సత్కరించి, స్వామి వారి ఫోటో అందించి కృతజ్ఞతలు తెలిపారు.