by Suryaa Desk | Mon, Dec 30, 2024, 08:23 PM
రేపు హైకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ జరగనుంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. రేపటితో కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ముగియనున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ కోర్టును మరోసారి కోరనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ సమాధానమిచ్చారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఈ నెల 27న హైకోర్టు విచారించింది. కేటీఆర్ అరెస్టుపై జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. కాగా.. కేటీఆర్‌ను అరెస్ట్ చేయరాదన్న ఆదేశాలను ఈ నెల 31 వరకు పొడిగిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం విచారణను కోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ వాయిదా రేపటితో ముగియడంతో కోర్టు తీర్పు, కేటీఆర్ అరెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఏ1 కేటీఆర్, ఏ2 అరవింద్ కుమార్, ఏ3 బీఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ ఇంకా నోటీసులు జారీ చేయలేదని సమాచారం. అయితే వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అధికారులు సిద్ధం చేశారు.