by Suryaa Desk | Mon, Dec 30, 2024, 02:57 PM
కోరుట్ల, మెట్ పల్లి డివిజన్ పరిధిలో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుపడితే కేసులు నమోదు చేస్తామని మెట్ పల్లి డీఎస్పీ ఏ. రాములు అన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం, బాణాసంచాలు పేల్చడం చట్టరీత్యా నేరమన్నారు.