by Suryaa Desk | Mon, Dec 30, 2024, 02:55 PM
రాబోయే నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ సంబరంగా జరుపుకోవాలని, ఈ నెల 31 రోజున నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకునే వాళ్లు చట్టాన్ని అతిక్రమిస్తే, వారిని రౌడీ షిటర్లుగా గుర్తించి కేసులు నమోదు చేస్తామని, రోడ్లపైన కేకులు కట్ చేయడం, బాణాసంచాలు పేల్చడం చట్టరీత్య నేరమని, ఒక్కసారి రౌడీ షీటర్లుగా కేసులు నమోదైతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని.
మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనం నడిపి అపాయాన్ని కొని తెచ్చుకోవద్దని, మిమ్మల్ని నమ్ముకున్న, మీ మీద ఆధార పడ్డ వారి జీవితాలను దుర్భరం చెయ్యొద్దని, ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరాన్ని కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సూచించారు.