by Suryaa Desk | Mon, Dec 30, 2024, 08:01 PM
TG: 2024లో నమోదైన కేసుల సందర్భంగా హైదరాబాద్ సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. "ఈ సంవత్సరం మొత్తం 35,944 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. గతేదాడి కంటే ఈసారి 45 శాతం ఎఫ్ఐఆర్‌ల నమోదు పెరిగింది. హత్యలు 13 శాతం తగ్గాయి, హత్యాయత్నం కేసులూ తగ్గాయి. కిడ్నాప్ కేసుల్లో 88 శాతం పెరుగుదల ఉంది. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 67 శాతం పెరుగుదల ఉంది. నేరాలు డిటెక్ట్ చేసే పర్సంటేజ్ 59 గా ఉంది. రికవరీ శాతం 58గా ఉంది" అని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.