by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:07 PM
సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో అయ్యప్ప స్వామి మండపం వద్ద అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి అయ్యప్ప స్వామి మాలధారులకు, భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..అయ్యప్ప గురు స్వాములు, మండప నిర్వాహకులు గౌరవ ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి నూతన సంవత్సరం క్యాలెండర్ లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, మండల కమిటీ అధ్యక్షుడు చిలుక సతీష్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గురుస్వాములు పాల్గొన్నారు.