by Suryaa Desk | Mon, Dec 30, 2024, 12:32 PM
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సమావేశంలో రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి..అతను చేసిన సేవలను గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్గా, డిప్యూటీ ఛైర్మన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారన్నారు.మన్మోహన్ సింగ్ తెలివితేటలు గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అన్నారు. ప్రపంచాన్ని పరిగెత్తించేలా చేసిన ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కి జీవితాంతం సేవలు అందించిన నేత మన్మోహన్ సింగ్ అన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా… కాంగ్రెస్ చేసిన ఆందోళనలు కూడా పాల్గొన్నారు మన్మోహన్ సింగ్. అది ఆయనకు పార్టీ మీద ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ బలం గుర్తించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు.