by Suryaa Desk | Sun, Dec 29, 2024, 06:55 PM
ఖాజీపల్లి గ్రామ శివారులోని గండిచెరువును ఇరిగేషన్ అధికారులు శనివారం పరిశీలించారు. గండిచెరువు ఎఫ్టీఎల్ పరిధిని పెంచారని ఇటీవల గ్రామస్తులు ఆర్కే ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది దండే రమాకాంత్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ రామస్వామి, ఏఈ ప్రసాద్ పీసీబీ అధికారి రవీందర్ గండిచెరువు ఎఫ్టీఎల్ పరిధిని పరిశీలించారు.
గండి చెరువు నీటిని పీసీబీ అధికారి శాంపిల్స్ సేకరించారు. గండి చెరువు ఎస్టీఎల్ పరిధి పెంచడంతో రైతుల పొలాలు నీట మునుగుతున్నాయని దీంతో వ్యవసాయ సాగు మరుగున పడిందని అధికారులకు రమాకాంత్ వివరించారు. ఎఫ్టీఎల్ పరిధిని తగ్గించాలని రైతులు గ్రామస్తులు అధికారులను కోరారు.