by Suryaa Desk | Mon, Dec 30, 2024, 10:31 AM
TG: కరీంనగర్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని ముకరాంపురలో మామ ఇంటిపై అల్లుడు తన స్నేహితులతో కలిసి దాడిచేశాడు. దీంతో మామ కూడా కత్తితో ప్రతిదాడి చేయడంతో.. అల్లునితోపాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో.. మామ, అల్లుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.