by Suryaa Desk | Sun, Dec 29, 2024, 03:03 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని, మట్వాడ గ్రామ కొమురం భీం యూత్ ఆధ్వర్యంలో, పుస్తకాల పంపిణీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు, కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో దాత వాసం ఆనంద్ కుమార్ న్యాయవాది, రీడింగ్ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహబూబాబాద్ జిల్లా సీనియర్ న్యాయవాదులు మామిడాల సత్యనారాయణ మాట్లాడుతూ.. సమాజంలో అంతరాలు తొలగిపోయి సమ సమాజ స్థాపన కోసం, విద్య క్రియశీల పాత్ర పోషించిందని, విద్య ద్వారానే అన్ని వర్గాలలో మార్పు వస్తుందని, విద్యకు దూరంగా ఉన్నటువంటి సమాజాలు అంతరించిపోయే దశలలో ఉన్నాయని, ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ ఆదివాసి గిరిజన విద్యార్థులు చదువులో రాణించి మీ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
అందుకోసం మాలాంటి వారి సహాయ సహకారాలు, న్యాయ సలహాలు సూచనలు మీకు అందిస్తామని, ఎన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురైనా విద్యకు దూరం కాకుండా, సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలా ఎదగాలని సూచించారు. అంబేద్కర్ లాంటి మహానీయులను ఆదర్శంగా తీసుకొని, ముందుకు సాగాలని గూడూరు మండలం అతి మారుమూల ఏజెన్సీ గ్రామం మట్వాడాలో, ఈ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు అనేక రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. ఈ పాఠశాలకు 70 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని, ఈ పాఠశాలను కాపాడాల్సికోవాల్సిన బాధ్యత ఈ గ్రామ ప్రజల మీద ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వాసం సారంగపాణి, గ్రామ పటేల్, రేగ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ సంధ్య సూర్యనారాయణ, గ్రామ పెద్దలు వాసం వీరస్వామి, కొమురం భీమ్ యూత్ అధ్యక్షుడు ఈసం రమేష్, యూత్ సభ్యులు మహేష్, అధ్యాపకులు శ్యామల, లాలు, సూర్యనారాయణ, రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.