by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:20 PM
భీమారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు పుప్పాల రచన, పల్లికొండ కీర్తన సీఎం కప్ ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ జూనియర్స్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరచిన రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు జవ్వాజి అశోక్ తెలిపారు. హన్మకొండ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారనీ వ్యాయామ ఉపాధ్యాయుడు పెసరి తిరుమలేశ్ తెలిపారు.
వీరిని కరీంనగర్ డి.వై.ఎస్.ఒ శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, సిద్ధారెడ్డి, బసరవేణి లక్ష్మణ్, ఉపాధ్యాయులు సాదుల ప్రసాద్, నరుకుల శ్రీధర్, నజీమా సాహేబా, ఎండి అఫ్సర్, కొప్పుల నరేందర్, కొక్కుల జయశ్రీ, నాగమల్ల రమేష్, మిన్నేని నీలిమ, చెరుకు సంధ్యారాణి, ఎస్టేరు రాణీ, నవ్య, గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు అభినందించారు.