by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:35 PM
సంక్రాంతికి తెలంగాణ నుండి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అదనంగా మరో 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతామని, ఈ సర్వీసులకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని సంస్థ వెల్లడించింది.