by Suryaa Desk | Sat, Jan 25, 2025, 12:35 PM
హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీఐడీకి అప్పగిస్తూ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అలకనంద ఆసుపత్రి అక్రమ కిడ్నీ మార్పిడి జరుగుతుందని రెండు రోజుల క్రీతం పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.