by Suryaa Desk | Sat, Dec 28, 2024, 09:09 PM
సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం ఇవ్వాలనేది తమ ప్రభుత్వం ఉద్దేశమని, ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాను వినియోగించబోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ సచివాలయంలో ఆయన రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంక్రాంతి నుంచి రైతు భరోసాను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. రైతు భరోసా పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటను వినియోగిస్తామన్నారు. గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.సాగు చేస్తున్న రైతుల పేర్లను వ్యవసాయాధికారులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని గుర్తించేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయగల కంపెనీల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు.