by Suryaa Desk | Sat, Nov 02, 2024, 04:12 PM
వికారాబాద్ పట్టణం లో మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లో భారీ దొంగతనం జరిగి సంచలనం సృష్టించిన కేసులోని నిందితుడిని కర్ణాటక రాష్టం లోని ఔరద్ తాలూకా లోని నారాయణపూర్ గ్రామం లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్టి కేసు యొక్క వివరలలోకి వెళితే 19.10.2024 రోజున వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు మణప్పురం రీజినల్ మేనేజర్ రవీంద్ర కుమార్ నుండి వికారాబాద్ పట్టణం లోని మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ నందు ఆడిటర్ తన టీం సభ్యులతో కలసి 16.10.2024 రోజున అడిట్ చేయగా ఒక బంగారం ప్యాకెట్ తక్కువ వస్తుంది అని నాకు ఫోన్ చేసి తెలపగా నేను 17.10.2024 రోజున వికారాబాద్ బ్రాంచ్ కి రాగ వికారాబాద్ బ్రాంచ్ లో మేనేజర్ విశాల్ లేకపోవడం తో అతనికి ఫోన్ చేయగా విశాల్ ఫోన్ లేపకపోవడంతో అనుమానం వచ్చి స్ట్రాంగ్ రూమ్ తెరచి ఆడిటర్ మరియు ఇతర సభ్యులతో కలసి అడిట్ నిర్వహించగా మొత్తం 63 బంగారం నగల ప్యాకెట్ లు కనిపించడం లేదు. వీటి మొత్తం బరువు సుమారు 2944.226 గ్రాములు, సుమారు వాటి విలువ 2,10,80,290 రూపాయలు ఉంటుంది. వికారాబాద్ బ్రాంచ్ మేనేజర్ విశాల్ తన కంపెనీకి నమ్మకద్రోహం చేసి, మోసపూరితంగా బంగారు నగల దొంగతనం చేసినాడు. అతనికి వికారాబాద్ మణప్పురం ఉద్యోగులు అయిన జూనియర్ అసిస్టెంట్ లు శివప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి మరియు ఆడిటర్ రాజకుమార్ లు సహకరించారు అని ఫిర్యాదు రాగ వికారాబాద్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి కేసులో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వికారాబాద్ డీస్పీ శ్రీనివాస్ రెడ్డి మరియు సీసీస్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య ఆధ్వర్యంలలో ప్రత్యేక బృందలను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించి నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం A1 నిందితుడు విశాల్ ను తన స్వగ్రామం నారాయణపూర్ గ్రామం లో అరెస్టు చేసి వికారాబాద్ డిఎస్పి గారి ముందు హాజరుపర్చడం జరిగింది.
నేరం చేసిన విధానం :
నేరస్థుని వివరాల లోకి వెళితే నేరస్థుడు విశాల్ జులై 2023 నుండి వికారాబాద్ మణప్పురం బ్రాంచ్ నందు మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మణప్పురం గోల్డ్ లోన్ కంపనీ నిబందనల ప్రకారం ఈ కంపనిలో గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్,మొబైల్ నెంబర్ మరియు బంగారం తీసుకొని బ్రాంచ్ కి వెళ్ళాలి ఆన్లైన్ కస్టమర్ వివరాలు నమోదు చేసి కస్టమర్ ID అయిన తర్వాత బంగారం యొక్క నాణ్యతా ను పరిశీలించి ఒక గ్రామ్ ప్లేడ్జ్ విలువ 5,000 రూపాయలు వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సారి ఒక కస్టమర్ ఐడి నమోదు అయిన తర్వాత ఆ కస్టమర్ మళ్ళీ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే బంగారం తప్ప ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎన్ని సార్లు అయిన బంగారాన్ని పెట్టుకోవచ్చు. మరియు తమ బిజినెస్ కొరకు ప్రతి రోజు ఒక లోన్ తప్పకుండా చేయాలని కంపెనీ నిబంధనల ప్రకారము దానిని తన అవసరాల కోశము బ్రాంచ్ హెడ్ అయోనా మనప్పరం మేనేజర్ విశాల్ వియోగించుకొని మేనేజ్మెంట్ యొక్క డబ్బును నకిలీ లోన్లు ద్వారా నగదు రూపములో తీసుకొని ఖజేయాలని పన్నాగం పన్ని తన క్రింది స్థాయి సిబ్బందిని తను నిజాయితీ పరుడిగా నమ్మించి మొత్తం 20 మంది కస్టమర్ల పైన 63 నకిలీ ఇన్ వెంటరీ ఐడిలు నమోదు చేసి మొత్తం 1 కోటి 24 లక్షల రూపాయలు బ్రాంచ్ నుండి ఖజేయడం జరిగింది. పై అధికారులు ఆడిట్ కు వచ్చే సమయం లో నిందితుడు ఏ ఏ ఐడికలలో ఆడిట్ జరుగుతుందో అట్టి ఐడింల సమాచారం ముందుగానే తెల్సుకోని అ ఐడిి లలో సరిపడా బంగారాన్ని చెకింగ్ సమయములో పెట్టేవాడు.ఈ విధంగా బంగారాన్ని తాను చేసిన నకిలీ ID లు గుర్తు పట్టకుండా తయారు చేసి చూపించే వాడు. ఈ విధంగా డబ్బులు తీసుకొని కోట్లు సంపాదించాలని దురాశతో బెట్టింగ్ పెట్టడం జరిగింది. ఇందులో కొంత డబ్బు తన సొంతనికి కూడా వాడుకోవడం జరిగింది. కస్టమర్ల కుదువ పెట్టిన బంగారం ప్యాకెట్ల నుండి 5 ప్యాకెట్లు దొంగతనం చేసి పారిపోగా నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు నిందితున్ని వికారాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి 5 బంగారం ప్యాకెట్లు లోని 83గ్రాముల బంగారం, 10 లక్షల రూపాయల డబ్బులను రికవరీ చేయడం జరిగింది.
2944.226 గ్రాములు బంగారానికి సంబంధించిన కేసు అవ్వడం వలన ఇట్టి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది. ఇట్టి కేసులో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఫిర్యాదు రాగానే కేసు క్రైమ్ నెంబర్ 383/2024,BNS సెక్షన్లు 303(2), 316(5), 318(4)ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించడం జరిగింది.నేరస్థునికి సహకరించిన వారిపైన , ఆడిట్ నిర్వహించిన వారిపైన , విజిలెన్స్ టీమ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహక.