by Suryaa Desk | Sat, Nov 02, 2024, 04:15 PM
వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఇటీవల బదిలీలలో నియమించబడిన డాక్టర్ వై వెంకట రవణ నేడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం డిఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది, ప్రోగ్రాం అధికారులు నూతనంగా నియమింపబడిన డిఎంహెచ్ఓ కి పుష్పగుచ్చము మరియు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ ని, అడిషనల్ కలెక్టర్ సుధీర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ జీవరాజ్, డాక్టర్ రవీంద్ర యాదవ్, వి.శ్రీనివాసులు డిప్యూటీ డెమో పాల్గొన్నారు.