by Suryaa Desk | Sat, Nov 02, 2024, 04:21 PM
హైదరాబాద్‌లోని తార్నాకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న మహిళను ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.
తార్నాక నుంచి హబ్సిగూడ వెళ్లే దారిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.